18 July, 2026 | 10:13 PM

25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి

01-07-2024 01:58 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, జూన్ 30:  ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇది సరికాదని అన్నారు. 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు.

బీఈడీ చేసిన వాళ్లు 4 లక్షలకు పైగా ఉన్నారని, కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం 2,200 మాత్రమే ఉన్నాయని, వాటి సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడ ంతో 16 వేల పాఠశాలల్లో ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ బోధించేవారు లేరని అన్నారు. అదే విధంగా డీఎస్సీని రెండు నెలలు వాయిదా వేయాలని కోరారు.  అన ంతయ్య, పవన్, వేముల రామకృష్ణ, సందేష్, రాందేవ్, భూపేష్, సాగర్ పాల్గొన్నారు.