సమస్యలను పరిష్కరించండి
01-07-2024 02:02 AM
- గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన సర్పంచ్‌ల సంఘం జేఏసీ
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణను రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. సర్పంచుల పదవీకాలం దాటి ఆర్నెల్లు దాటినా గ్రామాభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం స్పందించటం లేదన్నారు. గ్రామాల లో అభివృద్థి కార్యక్రమాలు, రైతు వేదికలు, క్రీడ ప్రాంగణాలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమ స్య లను తమ సొంత డబ్బులు ఖర్చు చేసి అభివృద్ది పనులు చేశామన్నారు. తమకు రావా ల్సిన బిల్లులు వచ్చేలా చూడాలని కోరారు.






