26 April, 2026 | 6:39 AM

గోదాం నిర్మాణానికి 20 గుంటల భూమి

29-11-2024 12:53 AM

కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): సదాశివనగర్ మండ లం కూప్రియాల్‌లో గోదాం నిర్మాణానికి గురువారం 20 గుంటల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు.