23 July, 2026 | 12:27 AM

రాత్రి వేళ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్

23-07-2026 12:00 AM
  1. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్
  2. కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

సికింద్రాబాద్, జూలై ౨2 (విజయక్రాంతి): హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును నగర కమిషనర్ టాస్క్ ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టాస్క్ఫోర్స్ డిసిపి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు 1 కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు.

అరెస్ట్ అయిన నిందితులు సొంకాంబ్లే హరీష్, సొంకాంబ్లే ఆకాశ్ సోదరులు. హరీష్ ఓ జ్యువెలరీ ఎక్స్పోరట్స్ సంస్థలో సేల్స్ ఎగ్జి క్యూటివ్గా పనిచేస్తూ,సంస్థలోని బంగారు ఆభరణాల నిల్వపై పూర్తి సమాచారం కలిగి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సోదరుడితో కలిసి దొంగతనానికి పథకం రచించిన హరీష్, జూలై 17నకార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి బంగారు ఆభరణాలను అపహరించాడు. అనంతరం వాటిని తన సోదరుడు ఆకాశ్కు అప్పగించాడు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల సహాయంతో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీసులు వేగంగా విచారణ జరిపి మంగళ్హాట్ ప్రాంతంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, మొత్తం బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని టాస్క్ఫోర్స్ డిసిపి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ అభినందించారు.