23 July, 2026 | 12:27 AM

అక్రమంగా వ్యర్థాలు వేసే వారిపై కఠినచర్యలు

23-07-2026 12:00 AM

ఏంఏంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

మేడ్చల్, జూలై 22 (విజయక్రాంతి): అల్వాల్ సర్కిల్లోని పెరుమాళ్ల స్వామి ఆల య ప్రాంతంలో బుధవారం ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను పరిశీలించారు.అక్రమంగా వ్యర్థాలు పారబోసిన వారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.ట్రేడ్ లైసెన్సుల పునరుద్ధరణ తప్పనిసరి గా  చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠి నచర్యలు తీసుకుంటామన్నారు.

ఖాళీ ప్లాం టర్ బాక్స్లలో వెంటనే మొక్కలు నాటాలని ఆదేశించారు. 15 రోజుల తర్వాత ప్రత్యేక స మీక్ష నిర్వహించి పురోగతిని పరిశీలిస్తామని కమిషనర్ వినయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ ఇం జినీర్, అసిస్టెంట్ కమిషనర్ (టౌన్ ప్లానిం గ్), అర్బన్ బయోడైవర్సిటీ  అధికారులు, బిల్ కలెక్టర్ పాల్గొన్నారు. వీరందరితో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ట్రేడ్ లైసెన్సుల అమలు, పచ్చదనం అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

వాణిజ్య సంస్థలన్నీ తమ ట్రేడ్ లైసెన్సులను సకాలంలో పునరుద్ధరించుకొని చట్టబద్ధంగా వ్యాపారాలు నిర్వ హించేలా చర్యలు తీసుకోవాలని బిల్ కలెక్టర్ను కమిషనర్ ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా, పునరుద్ధరణ చేయకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై నిబంధన ల ప్రకారం జరిమానాలు విధించాలన్నారు.