15 August, 2026 | 8:13 AM

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి

11-11-2024 01:33 AM

సూర్యాపేట, నవంబర్ 10 (విజయక్రాంతి): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మం డల కేంద్రంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకా రం.. రఘునాధపాలెంకు చెందిన సంగు శ్రీనివాసరావు(30), పెదవీడకు చెందిన షేక్ మస్తాన్(36) రెండు వేర్వేరు బైకులపై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నారు. ఈ ఘట నలో ఇద్దరు మృతి చెందారు. శ్రీనివాస్‌రావు బైక్‌పై ఉన్న ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా హుజూర్‌నగర్ హాస్పిటల్‌కు తరలించారు.