calender_icon.png 23 October, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

23-10-2025 12:04:21 PM

యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

యాచారం: ట్రాక్టర్, బైక్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి  చెందారు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్(Yacharam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కడ్తాల్  మండలం ముద్విన్ గ్రామానికి చెందిన తలేటి  స్వామి (37), తలేటి సాత్విక్  (4), తలేటి అభిరామ్ (9), ఆర్తి రామ (5) నలుగురు ద్విచక్ర వాహనంపై యాచారం నుండి చండూరు మండలం ధోనిపాముల బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళుతుండగా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడెం గేటు వద్ద ట్రాక్టర్ డీ కొట్టడంతో తలేటి అభిరామ్, ఆర్తిరామ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ఇద్దరినీ చికిత్స నిమిత్తం మాల్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.