1 July, 2026 | 1:17 AM

రూ.80 కోట్లతో రెండు ఖరీదైన ప్రాపర్టీలను...

26-05-2024 12:05 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 25 (విజయక్రాంతి): దివీస్ పార్మా కంపెనీ అధినేత మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి హైదరాబాద్‌లో రూ.80 కోట్లు వెచ్చించి రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్‌లో 12 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా కలిగిని ప్రాపర్టీని ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.40కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే మరో 12వేల చదరపు అడుగుల స్థలాన్ని మోటూరి సూర్య కమల్ ప్రసాద్ నుంచి రూ.40కోట్లకు కొనుగోలు చేశారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తో పాటు హైదరాబాద్‌లోనూ ఖరీదైన ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతోంది. 

-కొనుగోలు చేసిన నీలిమా ప్రసాద్ దివి