1 July, 2026 | 2:15 AM

ఓటు చోరీకి పాల్పడే వారితో అప్రమత్తంగా ఉండాలి

01-07-2026 01:16 AM

మాజీ మంత్రి చంద్రశేఖర్ 

జహీరాబాద్, జూన్ 30 : ఓటు చోరీకి పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ముంగి చౌరస్తాలో గల ఓ ఫంక్షన్ హాల్ లో బిఎల్‌ఓల గుర్తింపు కార్డుల పంపి ణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో ఓటు చోరీకి పాల్ప డే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. భారత రాజ్యాంగం ప్రకా రం ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించుకు నే బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

ఓటర్ల ప్రత్యేక సవరణ చేపడుతున్న సమయంలో ఎవరైనా ఓటర్లను తొలగించడం గానీ, బోగస్ ఓట్లను చేర్పించడం గానీ చేసినట్లయితే వెంటనే ఎన్నికల అధికారులకు తె లియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో బిఎల ఏ లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ అసెంబ్లీ కోఆర్డినేటర్ మొహమ్మద్ గౌస్, మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, లింగయ్య స్వామి, ఉజ్వల్ రెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.