23 May, 2026 | 3:18 AM

వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్

23-05-2026 02:05 AM

బాన్సువాడ, మే 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామం వద్ద వన్య ప్రాణులను గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. రుద్రూర్కు చెందిన రవి, బోధన్కు చెందిన రాజుగా గుర్తించారు.మద్నూర్ మండలం నుంచి ఏదు ( ముళ్ల పందులను) కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తుండగా బాన్సువాడ అటవీ రేంజ్ అధికారి హబీబ్ ఆధ్వర్యంలో అధికారులు పట్టుకున్నారు. ముళ్ళ పందులను ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.