17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

24-02-2026 01:24 AM
  1. మరొకరి పరిస్థితి విషమం
  2. బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్
  3. రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ చౌరస్తాలో ఘటన

చేవెళ్ల ఫిబ్రవరి 23(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. షాబాద్ మండ లం హైతాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. నాగర్‌గూడ చౌరస్తా వద్ద వారి బైక్‌ను కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలోబైక్‌పై వెళ్తున్న దాసరి అజయ్(19), ఉదయ్‌కిరణ్(20) మృతి చెం దారు.

అజమ్(19)కి తీవ్ర గాయాలు కాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇరువురి మృతదేహాలను చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అయితే అర్ధరాత్రి ఈ యువకులు నాగర్‌గూడ ఈసీ వాగు దాటాక అల్లవాడ రెవెన్యూలో ఉన్న పెట్రోల్‌బంకులో పెట్రోల్ పోసుకొని తిరిగొ స్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అజయ్‌కి అమ్మలేదు. నాన్నతో ఉంటూ చికెన్ షాప్‌లోకూలీగా చేస్తున్నాడు. ఉదయ్‌కిరణ్ కూడా కూలీనే. ఇద్దరు యువకులు దుర్మరణం చెందడంతో హైతాబాద్ లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. 

సీఐ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

మొయినాబాద్ సీఐ పావనకుమార్‌రెడ్డి విజిటింగ్ నిమితం వెళ్లుతున్నాడు. ఆ సమ యంలో అటు రావడంతో గాయాలైన అజమ్‌ను ఆయన కారులో హాస్పిటల్‌కు తరలించారు. చేవెళ్ల ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి, మొ యినాబాద్ ఎస్‌ఐ నర్సింహారావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన యువకుల శరీర భాగాలూ చిన్నభిన్నమయ్యాయి. పోలీసులతో కలిసి స్థానికులు సహాయక చర్యలు చేశారు.