రెండు కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరి అరెస్ట్..
కోదాడ, జూలై 31 : కోదాడ పట్టణ పోలీసులు రెండు కిలోల గంజాయి పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. శుక్రవారం కోదాడలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి వెల్లడించిన వివరాల ప్రకారం కోదాడకు చెందిన అవిడి రాఘవ, పంది వినోద్లు అల్వాలపురంకు చెందిన మద్దే రవితేజ వద్ద గంజాయి కొనుగోలు చేసి, కొంత విక్రయించి, మిగతాది తాము వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో దుర్గాపురం క్రాస్ రోడ్డులో ఖమ్మం బైపాస్ పక్కన ఓ మామిడి తోటలో ప్యాకింగ్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టణ పోలీసులు దాడి చేసినట్లు వివరించారు.
సంఘటనా స్థలంలో అవిడి రాఘవ, పంది వినోద్లను అరెస్ట్ చేయడంతో పాటు వీరి వద్ద నుండి 2 కిలోల గంజాయి, పల్సర్ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్దే రవితేజ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో టౌన్ సీఐ శివశంకర్, ఎస్త్స్ర అజయ్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు.






