30 August, 2026 | 8:57 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

రెండు లారీలు ఢీ... ఒకరి మృతి

26-06-2025 07:35 PM

మరొకరికి గాయాలు..

లక్షెట్టిపేట (విజయక్రాంతి):  మండలంలోని ఇటిక్యాల స్టేజి సమీపంలో ఎన్హెచ్-63 రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి (రాత్రి 12.30గంటలకు) రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో సిమెంట్ లోడ్ ట్యాంకర్ డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్(52) అక్కడికక్కడే లారీలో ఇరుక్కుని తీవ్ర గాయాలు అయి మృతి చెందాడని స్థానిక ఎస్సై గోపతి సురేష్(SI Gopathi Suresh) తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు కాశిపేట మండలంలోని పల్లంగుడా గ్రామానికి చెందిన వాడని తన లారీ దేవపూర్ లో లోడ్ చేసుకొని మహారాష్ట్ర నాందేడ్ వైపుకు వెళ్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న సంతూర్ సబ్బుల లోడ్ తో వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టడం జరిగిందన్నారు.

ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు అయి రోడ్డుపైనే ఉండటంతో రాత్రి సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ సిబ్బందితో కలిసి రెండు క్రేనులు, జేసిబిల సహాయంతో లారీల్లో ఉన్న డ్రైవర్ శ్రీనివాస్ మృతదేహాన్ని బయటకు తీశారు. రోడ్డుపై నుండి లారీలను తొలగించి వాహనాలను పంపించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సచిన్ కుమార్ కి కూడా గాయాలు అయ్యాయి. మృతుడు శ్రీనివాస్ భార్య తాళ్లపల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.