27 April, 2026 | 3:59 AM

ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

27-04-2026 02:24 AM
  1. మరో ఇద్దరి పరిస్థితి విషమం..
  2. హత్యా? ఆత్మహత్యా? ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు

ఖమ్మం, ఏప్రిల్ 26(విజయక్రాంతి): ఖమ్మం నగరంలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలో ఇద్దరు తమ ఇంట్లో విగతజీవులై కనిపించారు. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించిన ఘటన మామిళ్ళగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామానికి చెందిన కణతాల రాము గత కొద్ది సంవత్సరాలుగా ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెం సాయిబాబా గుడి సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.

ఇంటిపక్కన వారు రాము ఇంట్లోకి వెళ్ళి చూడగా రక్తపుమడుగులో రాము, ఆయన కుమార్తె దివ్య(5) విగతజీవులై కనిపించారు. వాళ్ళకు కొంచెం దూరంలో రాము భార్య రమ్య, చిన్న కూతురు దితిక(3) అపార్మక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రాము భార్య, చిన్న కూతురును 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రాము, దివ్య మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో రక్తపు అనవాళ్ళు ఉండటంతో హత్య? ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.