మరో రెండు కొత్త డిగ్రీ కాలేజీలు
07-06-2024 02:36 AM
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో రెండు కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇటీవలే వీటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూ రుల్లో వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మద్దూరుకు కోఎడ్యుకేషన్ కళాశాలను, కోస్గికి మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. 2024 విద్యాసంవత్సరానికి చేపట్టే దోస్త్ అడ్మిషన్లలో భాగంగా ఈ రెండు కాలేజీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.






