నర్సరీ పిల్లలపై లైంగిక వేధింపులు.. రైల్వే స్టేషన్‌ను ముట్టడి
20-08-2024 03:34 PM
థానే: దేశంలో ఎక్కడో అక్కడ మహిళలు, చిన్నారులపై లైగింక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా థానేలో ఇద్దరు నర్సరీ బాలికలపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన వెలుగుచూసింది. స్కూల్ స్వీపర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆగస్ట్ 12, 13 తేదీల్లో ఘటన చోటుచేసుకుంది. చిన్నారులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ బద్లాపూర్ స్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహించారు. ఈ రైల్‌రోకోలో పెద్దసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. అక్కడితో ఆగకుండా నిరసన కారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. ఆగస్ట్ 16న బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు పెట్టడంలో ఇన్స్‌పెక్టర్ ఆలస్యం చేశాడు. దీంతో ఇన్స్‌పెక్టర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలసుల అదుపులో ఉన్నాడు.






