ఒకే రన్‌వేపై రెండు విమానాలు
10-06-2024 01:55 AM
ముంబై, జూన్ 9: నిత్యం రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం టేకాఫ్ అవుతుండగా అదే రన్‌వేలో మరో విమానం ల్యాండ్ అయింది. ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ విచారణకు ఆదేశించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో విధులు నిర్వర్తించిన అధికారిని సస్పెండ్ చేశారు. తిరువనంత పురం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఇండో ర్ నుంచి వస్తున్న ఇండిగో విమానం అదే రన్‌వేపై కొద్దిపాటి దూరంలోనే ల్యాండ్ అయింది. ఎయిర్‌ఇండియా విమానం టేకాఫ్‌లో కొద్ది సెకన్లు ఆలస్యమైనా ఘోర ప్రమాదం జరిగేది.






