calender_icon.png 13 October, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండు జీవితానికి రెండే పోలియో చుక్కలు

13-10-2025 12:20:04 AM

-0 ఏళ్ల చుక్కల మందు తప్పనిసరిగా వేయించండి

-నాగోల్ డివిజన్ కార్పొరేటర్ అరుణ సురేంద్రనాథ్ యాదవ్ 

హైదరాబాద్, అక్టోబర్ 12(విజయక్రాంతి): హైదరాబాద్ నగరం నాగోల్ డివిజ న్ పరిధిలోని గవర్నమెంట్ హైస్కూల్, సాయినగర్ రోడ్డు నంబర్ 6బీ వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా 0 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగోల్ డివిజన్ కార్పొరేటర్ అరుణ సురేంద్రనాథ్ యాదవ్ మాట్లాడుతూ 0 ఏళ్ళలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిం చాల్సిందిగా కోరారు. బిడ్డల అంగవైకల్యాన్ని నివారించడంలో ఇది ఏకైక మార్గమన్నారు. భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ, కొన్ని దేశాల్లో పోలియో ఇంకా ఉం ది. మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు.

మీ పిల్లల రక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతిసారి పోలియో మోతాదు ఇవ్వం డి.. పోలియోపై విజయం సాధించడంలో దేశానికి తోడ్పడండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్. సరస్వతి. సిబ్బంది అంజి,ఫార్మసీ సిస్టర్స్ సుజాత, ప్రియాంక,శారద, ఆరోగ్య విభాగం అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు.