calender_icon.png 3 December, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

03-12-2025 12:03:06 AM

నిజాంసాగర్, డిసెంబర్ 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో గల మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను  వడ్డేపల్లి గ్రామ శివారులో మంగళవారం పట్టుకున్నట్లు నిజాంసాగర్ ఎస్త్స్ర శివకుమార్ తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.