రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
09-05-2026 08:08 PM
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదన్న ఎస్సై
పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో మంజీరా నది నుంచి శుక్రవారం అర్థరాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ట్రాక్టర్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలో మంజీరా నది, చెరువుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.






