10-06-2025 12:40:40 AM
మణికొండ జూన్ 9 : పూపాలగూడ లో 200 ఏళ్ల పురాతన మర్రి చెట్టును ఓ బిల్డర్ కూల్చివేయడం వివాదాస్పదం అయ్యింది. మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న ఈ భారీ వృక్షాన్ని బిల్డర్ రాత్రికి రాత్రే కూల్చివేశాడు. ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మర్రిచెట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుని ఆ బిల్డర్ పై కేసు నమోదు చేశారు.
తన నిర్మాణాలకు అడ్డుగా ఉందనే కారణంతోనే బిల్డర్ ఈ మర్రిచెట్టును కూల్చివేసినట్లు తెలుస్తోంది.అలాంటి పురాతన వృక్షాన్ని బిల్డర్ తన స్వార్థంతో కూల్చివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ మర్రిచెట్టు సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనే స్థానికులు అభిప్రాయపడుతున్నారు.