13 July, 2026 | 1:47 AM

చెరువులో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

13-07-2026 12:00 AM

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో ఘటన 

కొండాపూర్, జూలై 12(విజయక్రాంతి): చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు కొండాపూర్ ఎస్‌ఐ  సోమేశ్వరి తెలిపారు. సంగారెడ్డి తార డిగ్రీ కాలేజ్ చెందిన ఐదుగురు విద్యార్థులు మల్కాపుర్ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు.  జోగిపేటకు చెందిన సతీష్ (17), ఝరాసంగంకు చెందిన ప్రశాంత్ (19) నీటి ప్రహానికి కొట్టుకొని పోయారు.   ఈ మేరకు కేసు కేసు నమోదు చేశామని, మృతదేహాలను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించామన్నారు.