13 July, 2026 | 1:49 AM

సెంచరీ కంపెనీలో అగ్ని ప్రమాదం

13-07-2026 12:00 AM

సంగారెడ్డి జిల్లా ఐటీఏ బొల్లారంలో ఘటన

జిన్నారం/ అమీన్‌పూర్, జూలై 12(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐడీఏ బొల్లారంలోని సెంచరీ పరుపుల గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.  ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.