తెలంగాణను యాది జేసుకున్న జనం
ఖమ్మం, జూన్ 2(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని , పోరాటా పటిమను, తెలంగాణ సాధన అంశాలను ప్రజలు మరోసారి యాదిజేసుకున్నారు.మంగళవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ దివాకర్, కమీషనరేట్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్ జెండా ఆవిష్కరణ చేశారు.
గ్రామగ్రామాన, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాసు నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ కార్యాలయాల్లో అధ్యక్షులు జెండా అవిష్కరించారు. ప్రభుత్వ పథకాలు అమలు గురించి వివరించారు. పరేడ్ గ్రౌండ్లో అధికారులు, ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంస పత్రాలను అందించారు. ఉద్యమకారులను సన్మానించారు. అలాగే గ్రామాల్లోని అన్ని మండలాల్లో, పంచాయతీల్లో అధికారులు, సర్పంచులు, మార్కెట్ లలో చైర్మన్లు జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని కొన్ని ఆడారు.






