29-10-2025 01:28:24 AM
‘మెడికవర్’ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): గుండెకు చికిత్స.. ప్రతి జీవితానికి భరోసా అని మెడికవర్ ఆసుపత్రు లు, సికింద్రాబాద్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డా. ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి అన్నారు. గత రెండు దశాబ్దాలుగా 20వేలకు పైగా పీటీసీఏ (స్టెంట్) శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఆయన.. అందులో మూడు వేల మందికి పైగా రోగులను క్రమపద్ధతిలో ఫాలో-అప్ చేసిన అరుదైన రికార్డును నెలకొల్పారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే వైద్యుని ఆధ్వర్యంలో నిర్వహించిన అతిపెద్ద ఫాలో-అప్ అధ్యయనాల్లో ఒకటిగా గుర్తించబడింది. డా. ప్రమో ద్ క్లినికల్ ఖచ్చితత్వం, రోగి భద్రత, మానవతా దృక్పథంతో కూడిన సేవ పట్ల ఆయన అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా డా. ప్రమోద్‌కుమార్ కుచ్చులకంటి మాట్లాడుతూ.. “ప్రతి రోగి ఒక విశ్వాసం, ధైర్యం, ఆశ యొక్క కథ.
ఆధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి క్యాథ్ ల్యాబ్లు, మెడికవర్లోని అంకితభావంతో కూడిన హృ దయ వైద్య బృందం సహాయంతో, సమగ్ర ప్రాణరక్షక హృదయ సంరక్షణను అందించేందుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. నా లక్ష్యం ఎల్లప్పుడూ ప్రజలు ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించేందుకు సమయోచిత, ఖచ్చితమైన కరుణతో కూడిన చికిత్సలను అందించడం” అన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. “డా. ప్రమోద్ విజయం కేవలం సంఖ్యల మైలురాయిగా కాకుండా, దీర్ఘకాల రోగి సంరక్షణలో అగ్రగామి నిబద్ధతకు నిదర్శనం” అన్నారు. కాగా అత్యాధునిక ఇమేజింగ్ సిస్టమ్స్, 24 గంటలపాటు హృదయ అత్యవసర సేవలు, నిపుణులైన కార్డియాలజీ బృందంతో, మెడికవర్ ఆసుపత్రులు, సికింద్రాబాద్ విశ్వస నీయ కేంద్రంగా కొనసాగుతోంది.