5 May, 2026 | 8:18 PM

Breaking News

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •   జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు..   •   ఏరియా పర్సనల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతి   •  

యూకో బ్యాంక్ లాభం 27 శాతం వృద్ధి

22-01-2025 02:03 AM

కోల్‌కతా, జనవరి 21: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ నికరలాభం 2024 అక్టోబర్‌డిసెంబర్ త్రైమాసికంలో 27.1 శాతం వృద్ధిచెంది రూ. 638 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంక్ రూ. 502 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది.

తాజాగా ముగిసిన క్యూ3లో యూకో బ్యాంక్ మొత్తం ఆదాయం 15.5 శాతం వృద్ధితో రూ.6,412 కోట్ల నుంచి రూ. 7,405 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ. 5,551 కోట్ల నుంచి రూ. 6,219 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 3.78 శాతం నుంచి 2.91 శాతానికి మెరుగుపడగా, ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 96.12 శాతానికి పెరిగిందని బ్యాంక్ తెలిపింది.