19 March, 2026 | 9:59 AM

రేజోనెన్స్ స్కూల్‌లో ఉగాది వేడుక

19-03-2026 02:25 AM

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని రేజోనెన్స్ స్కూల్‌లో బుధవారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రా లు ధరించి, మామిడి తోరణాలు తరగతి గదులకు అలంకరించి, నవ వసంతానికి స్వాగతం పలికారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తమ తోటి స్నేహితులకు పంచారు. కొందరు చిన్నారులు కవితలు చదివి వినిపించారు.

మరికొందరు చిన్నారులు పంచాంగ శ్రవణం చేశారు. పాఠశాల డైరెక్టర్స్ ఆర్.వి. నాగేంద్రకుమార్, నీలిమ మాట్లాడుతూ.. ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల విద్యార్థులు అంకితభావం, గౌరవం కలిగి వుండాలని తెలిపారు. వేడుకలో ప్రిన్సిపాల్స్ ఉపాద్యాయ, ఉపద్యాయేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.