ఆల్ట్రా, ఊబర్ లగ్జరీ ప్లాట్లు
హైదరాబాద్‌లో ప్రస్తుతం విలాసవంతమైన భవంతులు విస్తరిస్తున్నాయి. నగరంలో నిర్మాణ రంగానికి ఎదురులేని ప్రాంతంగా ముద్రపడిన వెస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలలో 90శాతం బిల్డర్లు ఆల్ట్రా లగ్జరీ, ఊబర్ లగ్జరీ ప్లాట్లను నిర్మిస్తున్నారు. వాస్తవానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు రిస్క్ ఫ్రీ నిర్మాణాలపై బిల్డర్లు ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం నలుదిక్కులా అత్యంత ధనవంతుల కోసం విలాసవంతమైన భవంతులను నిర్మిస్తున్నారు. కానీ సొంతిళ్లు అవసరం ఉన్న పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం ఇండ్లు నిర్మించడంలేదు. తద్వారా ఇళ్లు కొనాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా బిల్డర్లు నిర్మిస్తున్న విలాసవంతమైన భవంతులలో ప్లాట్లను కొనుగోలు చేసే స్థోమత లేని కారణంగా 60శాతం మంది ప్రజలు నేటికీ అద్దె ఇండ్లలోనే జీవిక సాగిస్తున్నారు.






