దేశంలో రియల్ గ్రోత్
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 25 (విజయక్రాంతి): దేశంలో రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సెంటిమెంట్ స్కోర్ గరిష్ఠానికి చేరిందని నైట్ ఫ్రాంక్ తాజాగా వెల్లడిం చిన నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం గత త్రైమాసికం స్కోరు 69 ఉండగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 72కి చేరింది. గత పదేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే డెవలప్‌మెంట్ ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 2023 త్రైమాసికంలో 70 ఉండగా, 2024లో 73కు చేరింది. అలాగే రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు, ఆఫీసు లావాదేవీల ప్రమాణాలు 9 శాతం పెరిగాయని, వార్షిక ప్రాతిపదికన 43 శాతం పెరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటంతో మెజార్టీ ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటమే రియాల్టీ గ్రోత్‌కు కారణమని నైట్ ఫ్రాంక్ ఇండి యా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు.






