11 April, 2026 | 3:32 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం!

16-02-2026 09:25 PM

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి !!

అన్నదానం నిర్వహించిన పబ్బ సరూప రాణి రమేష్ గుప్తా కుటుంబ సభ్యులు!!!

శివంపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రమైన శివ్వంపేటలో కొలువైన శ్రీఉమామహేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్బంగా గత రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా శ్రీ ఉమామహేశ్వరుల కళ్యాణం ఆలయ ధర్మకర్తలు పబ్బ రమేష్ గుప్త, స్వరూప దంపతులు, పబ్బ మహేష్ గుప్త, స్వాతి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం కమనీయంగా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగింది. అంతకు ముందు మృత్యుంజయ హోమం, రుద్రాభిషేకం క్రతువులను వేదపండితులు శాస్త్రుల వామన శర్మ నెత్రుత్వంలో అర్చకులు జరిపించారు.

ఉమామహేశ్వరుల కళ్యాణ వేడుకలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారి ఆశీస్సులుఅందుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు మండల ప్రజలపై ఎల్లపుడు ఉండాలని, ఇంతటి ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్న పబ్బ రమేష్ రమేష్ కుటుంబ సభ్యులకు మరింత సేవ చేసుకునే భాగ్యం నిండుగా కలిగించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. అనంతరం పబ్బ మహేష్ గుప్త కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో భక్తులందరికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

స్వామివారి కళ్యాణవేడుకలలో గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్,సర్పంచులు వెంకటేశ్వర్, బ్యాగరి నర్సయ్య, విజయ్ నాయక్, మోకాళ్ల నవీన్, చింతకాయల కుమార్, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి,కొడకంచి శ్రీనివాస్ గౌడ్, బాసంపల్లి రామగౌడ్,జంగం విజయ వెంకటేష్,వంజరి గౌరీశంకర్, కొండల్, బాసంపల్లి పోచగౌడ్,పైనం యాదగిరి, పవన్ గుప్త,చంద్రకళ శ్రీశైలం యాదవ్, మర్రి మహేందర్ రెడ్డి, కల్లూరి వెంకటేష్, అధిక సంఖ్యలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.