20 June, 2026 | 3:51 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

వేయి స్తంభాల దేవాలయంలో కళ్యాణోత్సవం

16-02-2026 09:29 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఓరుగల్లు చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంలో సోమవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మూడవరోజు మహాశివరాత్రి పర్వదినం కళ్యాణోత్సవం నిర్వహించుకున్న రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారికి నాగవల్లి సదస్యం నిర్వహించడం జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆది దంపతులకు గణపతి పూజ, నీలాంబరి పూజ (నల్లపూసలు) నీల సుఖ మంత్ర పటంతో శ్రీ సూక్త మంత్ర పటములతో పూజా కార్యక్రమాలు నిర్వహించినారు.

నివేదన నీరాజనా మంత్రపుష్పం అనంతరం వేద పండితులు వేద గోష్టితో మహాసాధ్యాస్యం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, వేదంలోని గణ మంత్రములతో వేద పండితులు ఘనంగా సదస్యం నిర్వహించడం జరిగింది. ఈ నాగవెల్లి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు, మండవ శేషగిరిరావు, 11 మంది వేద పండితులు పాల్గొని స్వస్తి వేద పటంతో చేశారు. వేయి స్తంభాల ఆలయ కార్యనిర్వాకాధికారి డి. అనిల్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రుద్రేశ్వర స్వామికి మహా అన్నపూజ 51 కిలోల పెరుగన్నంతో అన్న సూక్త మంత్ర పటంతో అన్నపూజ నిర్వహించడం జరుగుతుందని, ప్రాంగణంలో  భక్తులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.