calender_icon.png 30 September, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

30-09-2025 12:17:58 AM

చారకొండ:సెప్టెంబర్ 29 : భార్య మృతితో కృంగుబాటుకు గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చారకొండ మండలంలోని జేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శంషుద్దీన్ కథనం ప్రకారం మండలంలోని జేపల్లి గ్రామానికి చెందిన వంకేశ్వరం వెంకటయ్య (35) తన భార్య అలివేల అనారోగ్యంతో ఏడాది క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి తాను ఎవరి కొరకు బ్రతకాలని తల్లిదండ్రులతో చెబుతూ తీవ్ర మనోవేదనకు లోనయ్యే వాడని తెలిపారు.

ఆదివారం అర్థరాత్రి పక్క గదిలో పడుకుంటానని తన తండ్రితో చెప్పి పక్క గదిలోకి వెళ్ళిన వెంకటయ్యను నిద్రలేపడానికి సోమవారం ఉదయం తండ్రి లక్ష్మయ్య వెళ్లగా గది తలుపు తీయకపోవడంతో కి టికీలోంచి చూడగా తాడుతో ఉరి వేసుకుని వెంకటయ్య వ్రేలాడుతూ కనిపించడంతో గట్టిగా అ రవడంతో పక్క ఇంటి వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.