calender_icon.png 30 September, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగల వేళ ఎలక్షన్ ట్రైనింగా?

30-09-2025 12:17:39 AM

  1. క్యాంపులను వాయిదా వేయాలి
  2. వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల  సందర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ట్రైనింగ్ క్యాంపులకు రావాలని ఎలక్షన్ కమిషన్ ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేయడం సరైన నిర్ణయం కాదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగల వేళ సంబురా లు రద్దు చేసుకొని ట్రెయినింగ్‌కు రావాలని ఆదేశాలు జారీ చేయడం తగదని ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టారు.

పండగ తర్వాత వారికి ట్రెయినింగ్ ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉద్యోగు లు, మహిళలు అందరు కూడా సెలవుల రీత్యా వారి వారి స్వగ్రామాలకు వెళ్లారని అన్నారు. బంధుమిత్రులతో కుటుంబమం తా సంతోషంగా పండగలు చేసుకునే ఆనందంలో  ఉన్నారని చెప్పారు.

ఇప్పటికిప్పుడు పండుగలు, బతుకమ్మ సంబరాలు వాయి దా వేసుకుని ట్రెయినింగ్‌కు రావాలని ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం సరికాదని బాలస్వామి విమర్శించారు. ట్రెయినింగ్ క్యాంపులను మరో రోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.