calender_icon.png 11 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

10-09-2025 11:24:29 PM

ముత్తారం (విజయక్రాంతి): అక్రమ సంబంధం బయటపడడంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ముత్తారంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మచ్చ నరేష్(32) స్వాతి ఇద్దరు పిల్లలతో కాపురం చేస్తున్నారు. నరేష్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యతో గొడవ పడుతూ కొట్టి పుట్టింటికి పంపించాడు. భార్య పుట్టింటికి వెళ్ళగా గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తన సోదరుడితో కలిసి మంగళవారం రాత్రి తమ భర్త ఆ వివాహితను పట్టుకున్నారు.

ముత్తారం పోలీస్ స్టేషన్లో తమ భర్త, ఆ మహిళపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపించారు. ఈ భర్త నాకు వద్దని పెద్దపెల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బుధవారం భార్య స్వాతి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న నరేష్ అవమానం భరించలేక బుధవారం మధ్యాహ్నం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య స్వాతి నా భర్త చావుకు కారణమైన అక్రమ వివాహాతను పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతుడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మ ధునయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.