calender_icon.png 11 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి సంచరిస్తుంది.. జాగ్రత్తగా ఉండండి

10-09-2025 11:16:36 PM

ఫారెస్ట్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): తిదిగుట్ట ప్రాంతంలోని గుట్టపై పులి సంచరిస్తుందని జాగ్రత్తగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయుటకు టిడి గుట్ట ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా ఆయనకు పలువురు చిరుత పులి మళ్లీ టిడి గుట్టలలో సంచరిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఎమ్మెల్యే వెంటనే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక టీములుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట  బోనులు ఏర్పాటు చేయాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే డ్రోన్లు కూడా ఉపయోగించాలని, ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా వీలైనంత త్వరగా పులిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే అధికారులతో మాట్లాడి హైదరాబాద్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పిస్తామని చెప్పారు.  ఎమ్మెల్యే తో పాటు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్,,  డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సాదతుల్లా, మహమ్మద్ మునీర్,  రాషెద్ ఖాన్, ఖాజా పాషా, అంజద్,  తదితరులు ఉన్నారు.