calender_icon.png 11 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెపోరుకు సర్వం సిద్ధం!

11-09-2025 12:00:00 AM

-రిజర్వేషన్ల పై నెలకొన్న ఉత్కంఠ 

-గ్రామాల వారిగా తుది ఓటర్ల జాబితా పూర్తి 

-పల్లె పోరు ఇప్పుడు ఉంటుందా.. ఉండదా...

-అంటూ అందరిలో సందిగ్ధం 

అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 10: స్థానిక పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామాలు, వార్డులు, ఎంపీటీసీ జెడ్పీటీసీ లకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రదర్శించారు. వివిధ రాజకీయ పార్టీ నేతలతో  ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వ హించి  ఓటర్ జాబితా పై  అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ప్రకటించారు.

పార్టీల వారీగా  బరిలో ఉండే  ఆశావావులంతా పోరులో నిలబడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అంతా రిజర్వేషన్ల పై నే పడింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాలు ఎవరికి కేటాయిస్తారు అంటూ ఆసక్తిగా ప్రస్తుతం పల్లెల్లో మాత్రం  చర్చలు సాగుతున్నాయి. అందరిలో మాత్రం రిజర్వేషన్లపై ఒకటే ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హాయాంలో 10 ఏండ్ల రిజర్వేషన్ల ను కొనసాగిస్తూ జీవో తీసుకొచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం  అట్టి రిజర్వేషన్లను యథావిధిగా ఉంచకుండా మార్పులు చేర్పులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది. అయితే ప్రభుత్వం గ్రామాల వారీగా రిజర్వేషన్ కేటాయిస్తే ఎలా ఏ ప్రతిపాదికన  రిజర్వేషన్లు కేటాయిస్తుందో అనని అంతా ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు  బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల ఇచ్చిన తరువాతనే స్థానిక పోరుకు వెళ్తామంటూ ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు ఉండడంతో  ప్రభుత్వం ఎలా ముందుకు పోతుంది... ప్రస్తుతం స్థానిక పోరు జరుగుతుందా? వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారా.... దీనిపై మాత్రం అటు ప్రభుత్వము, సంబంధిత శాఖల అధికారులు క్లారిటీ ఇవ్వలేకపో తున్నారు. ఎన్నికల ఓటర్ల తుది జాబితా ప్రకటించడం అనంతరం  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంత ఆసక్తిగా ఎదురుచూశారు కానీ.... ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు మాత్రం క్షేత్రస్థాయిలో కనబడటం లేదు. దీంతో స్థానిక పోరు ఇప్పుడు ఉంటుందా ఉండదా అని అంతా అయోమయంలో పడ్డారు.

రాజకీయ నేతల్లో భిన్న స్వరాలు....

వినాయక చవితి నుంచే గ్రామాలలో రాజకీయాలు వేడెక్కాయి. స్థానికపూర్ లో బరిలో నిలిచి ఆశవావులంతా  నిమజ్జ వేడుకలు అంతా తామే ముందుండి వేడుకను నిర్వహించారు. స్థానిక యువత, కాలనీ ఓట్లను ప్రభావితం చేసేందుకు  ఆశావాలు మాత్రం వినాయక చవితిని  రాజకీయానికి వినియోగించుకున్నారు. రిజర్వేషన్లు ఎవ్వరికి అనుకులం గా  వచ్చిన మనకు మనం సపోర్టుగా ఉండాలని ఒప్పందంతో ఒక నేతతోనే వినాయక చవితి ఖర్చు మొత్తం భరించే విధంగా తీర్మానాలు సైతం పల్లెల్లో చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలు ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్.  

ఓటర్ల మార్పు, చెర్పుల ప్రక్రియ పూర్తి..

 ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీల ఓటర్ల మార్పులు చేర్పులు నమోదు ప్రక్రియ పూర్తి అయ్యింది. అందులో పోలీంగ్ కేంద్రాలు, సర్పంచ్, ఎంపీటీసీల స్థానాలున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని మొత్తం గ్రామపంచాయతీలు 14, మొత్తం ఓటర్లు 35,585, వార్డులు 134, పోలీంగ్ కేంద్రాలు 148, ఎంపీటీలు 08 పోలింగ్ కేంద్రాలు61.

ఇబ్రహీంపట్నం మండలంలోని మొత్తం గ్రామపంచాయతీలు 14, మొత్తం ఓటర్లు 31,835, సర్పంచ్‌ల పోలింగ్ కేంద్రాలు 144,  ఎంపీటీల స్థానలు 10, ఎంపీటీల పోలింగ్ కేంద్రాలు58 కేటాయించారు. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, మొత్తం ఓటర్లు 50,195, వార్డులు 232, సర్పంచ్‌ల పోలింగ్ కేంద్రాలు232, ఎంపీటీల 14, ఎంపీటీల పోలింగ్ కేంద్రాలు232 కేటాయించారు. మొత్తం సర్పంచ్‌లు 64 ఎంపీటీలు45 జెడ్పీటీలు 04.

తుది జాబిత రెడీ చేశాం 

అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఓటర్ల మార్పులుచెర్పులు పక్రియ పూర్తి చేశాం. స్థానిక వివిధ రాజకీయ పార్టీల నేతలు సమీక్షా సమావేశాలు నిర్వహించాం. వాళ్లు తెలిపిన ఓటర్ల అభ్యంతరలను పరిగణలోకి తుదిజాబితా తయారు చేశాం. ఎన్నికలు ఎప్పుడు వల్ల నిర్వహించాడానికి సిద్థంగా ఉన్నాం. 

- శ్రీవాణి, ఎంపీడీవో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం