లోన్ ఆప్స్ ఒత్తిడి తట్టుకోలేక యువకుడు మృతి
హుజురాబాద్ (విజయక్రాంతి): లోన్ ఆప్స్(Loan Apps) ద్వారా అప్పులు చేసి యాప్స్ వేధింపులు భరించలేక అఖిలేష్(22) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఉదయం ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ రాజయ్య కుమారుడు అఖిలేష్ బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. గతంలో స్నేహితుల దగ్గర అప్పులు చేస్తే తల్లిదండ్రులే తీర్చారు. కాలేజీకి పోకుండా జల్సాలకు అలవాటు పడి మరల ఎంత చెప్పినా వినకుండా స్నేహితుల దగ్గర, లోన్ ఆప్ లా ద్వారా అప్పులు చేసి తీర్చలేక, ఎవరిని అడగలేక ఒత్తిడి గురై ఉరివేసుకొని మృతి చెందినట్లు తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






