calender_icon.png 2 December, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్, ఇద్దరు వార్డు సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక..

02-12-2025 08:59:12 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం ధర్మారావుపేట సర్పంచ్, రెండు వార్డుల సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వంత గ్రామంలో ప్రేమ్ సాగర్ రావు వర్గం సర్పంచ్ గా జుగునాక రాధ మనోజ్, ఇద్దరు వార్డు సభ్యులు పార్వతి పద్మపెద్దిరాజు, ఆజ్మీర శ్రీవల్లిలు ఒకొక్క నామినేషన్ వేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు కృషి చేసిన ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావుకి అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.