02-12-2025 09:38:37 PM
పంచాయితీ ఎన్నికల కోడ్ దృష్ట్యా తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన తుడుందేబ్బ నాయకులు
జిల్లా నితికా పంత్ కి వాయిదా తీర్మానాన్ని అందించినా తుడుందేబ్బ జిల్లా జనరల్ సెక్రటరీ పెందోర్ మారుతీ
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఈ నెల 9న ఆదివాసి పోరు గర్జన సభ వాయిదా వేస్తున్నట్లు తుడుం దెబ్బ నాయకులు ప్రకటించారు. సభ అనుమతిని కోరుతూ వారం రోజుల క్రితమే ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. పంచాయితీ ఎన్నికల కోడ్ దృష్ట్యా సభ వాయిదా వేయమని సంబంధిత అధికారుల కోరిక మేరకు తుడుందేబ్బ నాయకత్వము చర్చించి ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ ఎస్పీ నితికా పంత్ కు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు తీర్మానాన్ని అందజేశారు. త్వరలోనే ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.