calender_icon.png 29 December, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటీపీ లేకుంటే సిలిండర్ నో డెలివరీ

29-12-2025 01:24:11 AM

హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ 

అనంతుల లక్ష్మీనారాయణ

పాల్వంచ, డిసెంబర్ 28, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం గ్యా స్ లబ్ధిదారు లు ఓ టిపి తెలియజేయకుంటే సిలిండర్ డెలివరీ చేయడం నిలిచిపోతుందని హె పీ గ్యాస్ మేనేజర్ అనంతల లక్ష్మీనారాయణ తెలిపా రు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో కొత్త నిబంధనల ప్రకారం ఓటిపి తె లియపరచనియెడల మీ గ్యాస్ బుకింగ్ రద్దు చేయటమే కాకుండా, చెల్లించిన పైకం తిరిగి ఇవ్వబడదని ఆయన స్పష్టం చేశారు.

సబ్సిడీ దారులంతా ఏ ప్రక్రియలో ఎలాంటి పొరపాటు చేయకుండా డిసెంబర్ 20, 2025 నుంచి దేశవ్యాప్తంగా ఏ నియమాలు కచ్చితంగా అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు. గ్యాస్ వినియోగంలో జరుగుతున్న అవకతవకలను అరికట్టి పారదర్శకతగా నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఏ నిబంధనలను అమలు చేసిందన్నారు. కథ కొన్ని సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలు దుర్వినియోగాలు జరుగుతున్నాయని ఆయన తెలి పారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథ కం కింద ఇచ్చే సబ్సిడీలు తప్పించుకోవడం, బ్లాక్ మార్కట్లో అ మ్మకాలు ఇలాంటి సమస్యలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఓటిపి ని బంధనలను అమలు చేస్తుందన్నారు. సిలిండర్ బుక్ చేసిన తర్వా త మే రిజిస్టర్ మొబైల్ కు వచ్చే 4 అంకల ఓటిపిని డెలివరీ సిబ్బందికి తెలియజేయాలన్నారు. వారు తమ యాప్ లో దాన్ని ఎంటర్ చేసి ధ్రువీకరిస్తారు, అది జరిగితేనే సిలిండర్ అందజేస్తా రు, లేనియెడల సిలిండర్ డెలివరీ నిలిచిపోతుందన్నారు. గ్యాస్ సిలిండర్ వినియోగిస్తు న్న ప్రతి లబ్ధిదారులు ఏ నిబంధనలను పా టిస్తే మీకు మా త్రమే కాకుండా సమాజం మొత్తంకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.