calender_icon.png 15 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల ఆకస్మిక తనిఖీ

11-08-2025 12:38:03 AM

సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 10 : రోడ్డు ప్రమాదాలు, అక్రమ రవాణా నివారణలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహనాల ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 76 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.  వితౌట్ నెంబర్ ప్లేట్స్, ట్రిపుల్ రైడింగ్, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై, సరియైన ధ్రువపత్రాలు లేని వారిపై, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించని వారిపై 425 కేసులు  నమోదయ్యాయని పోలీస్ కమిషనర్ బి.అనురాధ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా చెక్ చేసినట్టు చెప్పారు.