11-08-2025 12:39:26 AM
మందమర్రి, ఆగస్టు 10 : సింగరేణి సంస్థలో నూతన గనులను ప్రారంభించి, ఉ ద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, కొత్త గనుల టెండర్ లో సింగరేణి సంస్థ పాల్గొనేలా రేవంత్ రెడ్డి ప్ర భుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని రా ష్ర్ట కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం నియోజక వర్గ పర్యటనలో భాగంగా ముందుగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజక వర్గంలోని ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ సంక్షే మ పథకాలు, అభివృద్ధి పథకాల పురోగతిపై రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రోడ్లు డ్రైనేజీలు తదితర పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో చెన్నూరు ని యోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ర్ట ప్రజల సొంతింటి కల ఆకాంక్షను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నమ్మిం చి మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని, చెన్నూరు నియోజకవర్గంలో 3800 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా చెన్నూరు ని యోజకవర్గం ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు 100 కోట్ల రూపాయలతో అ మృత్ స్కీం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.
నియోజకవర్గంలో ఇసుక మాఫియా, భూ దందాలకు చెక్ పెట్టామని తెలిపారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్లకే పరిమిత మైందని, అవే లక్ష కోట్లతో తెలంగాణలో నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చేవన్నారు. కేవలం కమిషన్ల కోసమే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించారు.