11-08-2025 12:37:42 AM
రామకృష్ణాపూర్, ఆగస్టు 10: రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9న గద్దరేగడి పద్మావతి కాలనీకి చెంది న మేకల రాజయ్య ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు 24గంటల్లో ఛేదించారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ వివరాలు వెల్లడించారు.
రాజయ్య కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న వెళ మంచిర్యాల రాజీవ్ నగర్ కు చెందిన జాడి సురేష్ అనే వ్యక్తి చొరబడి 13 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు.గద్దరేగడి సమీపంలోని ఓ చెట్ల పొద లో బంగారాన్ని దాచి పెట్టాడు. నిందితుని నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని నిందితున్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
సీసీ కెమెరాల వల్ల దొంగతనాలు నివారించవచ్చు: ఏసీపీ రవికుమార్
ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందని ఏసీపీ రవికుమార్ అన్నారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. అనంతరం కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చి న కానిస్టేబుల్ లకు రివార్డులు అందజేశారు. సమావేశంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్సు రాజశేఖర్, మందమర్రి ఎస్సు రాజశేఖర్, సీసీఎస్ లలిత పాల్గొన్నారు.