08-12-2025 12:00:00 AM
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 07 : రాజ్యాంగ దిన పక్షోత్సవాల సందర్భంగా సిద్దిపేటలోని సరస్వతీ శిశు మందిర్లో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం విలువలు’ పుస్తకాన్ని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏ.అరవింద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 15, 16, 17 ఆర్టికల్లు సమానత్వం, సోదరభావం, న్యా యం వంటి మౌలిక హక్కులను అందిస్తున్నాయన్నారు.
సామాజిక సమరసత వేదిక రాష్ట్ర వ్యాప్తంగా కుల, మత విభేదాలు లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తోందన్నారు. సంచారజాతుల కొన్ని కులాల పేర్లు ఇంకా ప్రభుత్వ రికార్డుల్లో లేవని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో రమేష్, మనోహర్, సంతోష్, మల్లారెడ్డి, విజయ భాస్కర్, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రభుదాస్ పాల్గొన్నారు.