calender_icon.png 10 February, 2026 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ప్రభుత్వ హయాంలో బంగారం,వెండి ధరలు ఆకాశాన్నంటాయి

10-02-2026 12:38:52 AM

  1. 6 గ్యారంటీల అమలుతోపాటు త్వరలో మరికొన్ని సంక్షేమ పథకాలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది
  2. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కరీంనగర్, ఫిబ్రవరి9 (విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వ హయాంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల నర్మదా నర్సయ్య, రవీందర్ లకు మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ ధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గా ్యరంటీల అమలతో పాటు త్వరలో మరికొ న్ని సంక్షేమ పథకాలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అ న్నారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదని, మేము 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు అర్హులై న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను జతచేసి వారందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున  సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు.

ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని 10 లక్షలకు పెంచి పేద ప్రజలకు ప్రభుత్వం పక్షాన వైద్య సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు మేము తప్పకుండా ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ అభ్య ర్థి మేయరుగా  ఎన్నికైన తరువాత తప్పకుండా అన్ని పనులను పూర్తి చేస్తామని తెలి పారు. ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు అం దించి అండగా ఉండే ఆలోచనలో ఉన్నామన్నారు.

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వ చ్చిన తర్వాత అనునిత్యం పెరుగుతున్న వెం డి, బంగారం ధరలతో ఒక పేదవాడు అర తులము, తులము, కొద్దిపాటి బంగారము కూడా కొనుక్కో లేని పరిస్థితిలో ఉన్నారన్నా రు. పేదల దగ్గర దోచుకుని పెద్దలకు పంచి పెట్టడమే బిజెపి సిద్ధాంతంగా మారిందన్నా రు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండి మరింత బలం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థులను గెలిపించాలని మంత్రి శ్రీధర్ బా బు కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అ సెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇం చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మ న్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే ఆరెపల్లి మోహన్, పాల్గొన్నారు.