09-05-2025 12:00:00 AM
సీఐటీయూ జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు
మణుగూరు, మే 8 ః కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింతగా దూకుడుగా అమలు చేస్తున్నదని సీఐటీయూ జిల్లా నాయకులు సత్తనపల్లి సాంబశివరావు అన్నారు.కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్తక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు కావాలన్నారు.
రానున్న బడ్జెట్లలో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందన్నారు. సామాజిక, సంక్షేమాలకు కోతలు పెట్టి. సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్లు రాయితులు ప్రకటించిన అన్నారు.
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాల స్వాతంత్ర ఫెడరేషన్లు మే 20 దేశంలో సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించినాయని ఇందుకు గ్రామపంచాయతీ కార్మికులు హక్కుల్లో భాగంగా స్థానిక ఎంపీ ఓ గారికి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నాయకులు రంగా సదానందం వీరన్న లక్ష్మయ్య పాల్గొన్నారు.