మండుటెండలో.. సాంప్రదాయబద్ధంగా పెర్సపెన్ పూజలు
- ప్రకృతి పూజారులుగా ఆదివాసులకు గుర్తింపు..
- సంస్కృతి సాంప్రదాయా లను భావితరాలకు అందించాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఉట్నూర్, మే 1 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గోండు కొలం గిరిజనులతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో నివాసముండే ఆదివాసి గిరిజనులు వారి వారి వంశం పెర్సపెన్ దేవతల పూజలు ముమ్మరం చేశారు. ఆదివాసి గిరిజనులు ప్రకృతి పూజారులుగా పేరు పొందినట్లే..
మండుటెండల ను సైతం లెక్కచేయకుండా వారి సంస్కృతి.. సాంప్రదాయాలు.. ఆచారాలకు ఎలాంటి లోటు రాకుండా.. ఆదివాసుల సాంప్రదాయ వాయిద్యాల మధ్య దేవతల మొక్కలు తీర్చుకుంటున్నారు.. ఆదివాసి తెగలోని నాలుగు దేవుళ్ళు, ఐదు దేవుళ్ళు, ఆరు దేవుళ్ళు, ఏడు దేవుళ్ళ కు చెందిన ఆదివాసీల్లో పెర్సపెన్ పూజలకు తరలివెళ్లి దేవతల ముక్కులు తీర్చుకుంటున్నారు.
కొట్నక్ పేర్సపెన్ గంగా స్నానాల వద్ద షెడ్ ప్రారం
వాంకిడి మండలంలోని భారీ బంబారాలో కొలువుదీరిన కొట్నాక్ వంశస్తుల పెర్సపెన్ కు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పూజలు చేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని జీవితి తాలూకాలోని భారీ గ్రామంలో కోట్నక్ పరివార్ వారి పేర్సపేన్ పూజలు ప్రారంభం దృశ్య గంగా స్నానాల వద్ద ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవతో ఐటిడిఎ నిధులతో షెడ్డు నిర్మాణం పూర్తవగా, ఆదివాసీ నాయకులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే షెడ్డు ప్రారంభించారు.
కోట్నాక్ పరివార్ వారి భేటీ లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కి శాలువాతో సన్మానించారు. షెడ్డు నిర్మాణానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదా యాలను నేటి తరాలకు అందించాల్సిన బాధ్యతతో ప్రజా ప్రభు త్వం ఉందని , ప్రభుత్వం ఆదివాసీల కోసం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజలకు అందుతున్న పథకాలను ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.
ఆదివాసి పిల్లలను బాగా చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృషి చేశారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు వారిని విద్యావంతులుగా ఎదిగే వి ధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొట్నాక్ పరివార పెద్దలు, గ్రామస్తులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేవతల వద్ద కొత్త కోడండ్ల బెట్టింగ్..
ఆదివాసీ గిరిజన తెగలోనే గోండుల సంస్కృతి సాంప్రదాయంగా కొత్తగా పెళ్లయిన కోడలు వారి కులదేవత వద్ద పూజా సామాగ్రి తెల్లని వస్త్రాలతో కులదేవత ఆశీస్సులు తీసుకోవలసిన ఆచారం. కులదేవత ఆశీస్సులు పొందుటకు పూజా సామాగ్రి తెల్లని వస్త్రాలతో కుల దేవత వద్దకు కాలినడకతో వెళ్లి దైవ దర్శనం చేసుకున్న తర్వాత పెద్దల ఆశీస్సులు పొందుతున్నారు..






