21-07-2025 12:04:06 AM
- హైదరాబాద్‌లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): ఇండియన్ స్ట్రోక్ అసోసియే షన్ (ISA), అసోసియేషన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఛాప్టర్ (API), సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (SEMI) సంయుక్తంగా ’బ్రెయిన్ స్ట్రోక్ - టైమ్ టు యాక్ట్‘ అనే అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ తాజ్ వివాంత హెూటల్‌లో నిర్వహించారు.
ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజ య మాట్లాడుతూ.. “బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి రావటమే కాకుండా 25 శాతం మం ది 40 సంవత్సరాలు లోపు వారే ఉండటం గమనార్హం. పక్షవాతానికి ఎక్కువ మందిలో వైద్యం లేదు అని అపోహ ఉన్నది. దానికి విరుద్ధంగా ఇప్పుడు చాలా ఎవిడెన్స్ బెస్ట్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చా యి. కానీ 1 శాతం మందే ఈ చికిత్సలను అందిపుచ్చుకోగలుగుతున్నారు.
ఈ పరిస్థిని మెరుగు పరచటానికి ఐఎస్‌ఏ దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది” అని చెప్పారు. ఈ కాంపెయిన్‌లో భాగంగా సీఎంఈలు, వర్క్ షాప్‌లు జరుగుతాయని డాక్టర్ సలీల్ ఉప్పల్ (ఐఎస్‌ఏ ట్రెజరర్) చెప్పారు. పక్షవాత లక్షణాలను ముందుగానే గుర్తించి, సకాలంలో చర్యలు తీసుకోవడానికి ఐఎస్‌ఏ ప్రోత్సహిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ న్యూరోలాజిస్ట్లు, ఎమర్జెన్సీ ఫిజిషియన్లు డాక్టర్ పి.విజయ, డాక్టర్ అరవింద్‌శర్మ, డాక్టర్ సలీల్ ఉప్పల్, డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ ఆర్.ఎన్. కోమల్ కుమార్, డాక్టర్ హరి రాధకృష్ణ, డాక్టర్ అమి త్ సరాఫ్, డాక్టర్ సౌజన్య పాటిబండ్ల, డాక్టర్ సంధ్యా మనోరంజ్, డాక్టర్ ఎస్. విజయ్ మోహన్, డాక్టర్ చైతన్య కోడూరి పాల్గొన్నారు.
స్ట్రోక్ చికిత్స, స్క్రీనింగ్, ఇమేజింగ్, మెకానికల్ థ్రాంబిక్టమీ, థ్రాంబోలైసిస్, హైపర్ టెన్షన్ చికిత్స, స్ట్రోక్ యూనిట్ నిర్వహణ వంటి అంశాలపై ప్రబోధనలు నిర్వహించారు. పక్షవాతం వైద్య అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని వారు చెప్పారు.
బీఫెస్ట్ పద్ధతిని పాటించి సమయాన్ని వృధా చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సమయానికి చికిత్స అందితే ప్రాణాలను కాపాడటమే కాకుండా, జీవితాంతం స్ట్రోక్ వల్ల కలిగే వైకల్యాన్ని కూడా నివారించవచ్చు అని చెప్పారు.