calender_icon.png 22 July, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

21-07-2025 12:04:51 AM

మిర్యాలగూడ. జూలై 20 విజయక్రాంతి:- నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సత్వరమే పూర్తిచేయాలని  మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  ఇరిగేషన్  అధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులు, స్థానిక నేతలతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అందుకు సంబంధించిన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే అధికారులకు చెప్పారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ పనులు పూర్తయితే 12,236 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పనులు పూర్తిచేసి రైతులకు లిఫ్టును అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. ఆయన వెంట డి ఈ కేశవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు  పొదిల శ్రీనివాస్. మండల పార్టీ అధ్యక్షుడు బాలు నాయక్. నాయకులు నాగయ్య తదితరులు ఉన్నారు.