23 March, 2026 | 12:09 PM

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకున్న నిరుద్యోగ యువత

23-03-2026 12:48 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, మార్చి 22 (విజయక్రాంతి): కామారెడ్డిలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పార్శి రాములు కళ్యాణ మండపంలో నిర్వహించిన జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువత తరలిరావడం అభినందనీయమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, జి సి ఆర్ ట్రస్ట్ చైర్మన్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 150 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిం ఛాయని తెలిపారు. జాబ్ మేళాకు హన్యుహన స్పందన లభించిందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు.

జాబ్ మేళాకు రాష్ట్ర సభ్యులు సహకారం అందించారని తెలిపారు. నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూలకు 3500 పైగా హాజరయ్యారని తెలిపారు. 350 మంది కంపెనీ ప్రతినిధులు ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. రానివారికి మరోసారి అవకాశం కల్పించేలా కృషి చేస్తామన్నారు. జాబ్ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగ యువతకు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి రామారెడ్డి, సదాశివ నగర్, దోమకొండ బిక్కనూర్ బీబీపేట్ రాజంపేట మండలాలతో పాటు చుట్టుపక్కల మండలాల చెందిన నిరుద్యోగ యువకులు జాబ్ మేళాకు హాజరైనట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మామిండ్ల అంజయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణహరి, నిమ్మ విజయకుమార్ రెడ్డి,  డిసిసి ప్రధాన కార్యదర్శి జూలూరు సుధాకర్, గణేష్, మున్సిపల్ కౌన్సిలర్ లు గడ్డమీద మహేష్, తాటి ప్రసాద్, రామ్ శెట్టి హర్షిత, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్ ,శంకర్ రావు, చాట్ల వంశీ కాంగ్రెస్ నాయకులు జమీల్, చింతల రవీందర్ గౌడ్, రంగా రమేష్ గౌడ్, మహేష్, బల్లం శ్రీనివాస్, నిరంజన్, మెహర్ బాబా గౌడ్, గంగారాములు తదితరులు పాల్గొన్నారు.